తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎట్టకేలకు రామవరంలో డిస్పెన్సరీ ప్రారంభించిన డైరెక్టర్ (పీపీ), ఏరియా జీఎం, ప్రధాన ఆసుపత్రి సీఎంఓ. గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) చేపట్టిన నిరంతర పోరాటం ఫలితంగా రామవరం సింగరేణి డిస్పెన్సరీని యాజమాన్యం సోమవారం ఉదయం పునఃప్రారంభించింది.ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ పాల్గొని మాట్లాడుతూ.రామవరం డిస్పెన్సరీని యథావిధిగా కొనసాగించడంతో పాటు పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని నియమించాలని కోరుతూ ఈ ఏడాది మే 31న ప్రధాన ఆసుపత్రి ముఖ్య వైద్యాధికారి (సీఎంఓ) డా. కిరణ్ రాజ్, ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజుకు ఎఐటియుసి నాయకులు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.ఎఐటియుసి చేసిన నిరంతర కృషి, యాజమాన్యంపై తీసుకొచ్చిన ఒత్తిడి ఫలితంగానే రామవరం డిస్పెన్సరీ తిరిగి ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాథమికంగా ఒక నర్సు, ఒక వార్డ్ బాయ్‌ను మరియు ఆయను నియమించి, బీపీ, షుగర్ తో పాటు సాధారణ మందులను అందుబాటులో ఉంచి సేవలు ప్రారంభించినట్లు తెలిపారు.రామవరం ప్రాంతంలో నివసిస్తున్న వందలాది మంది సింగరేణి కార్మికులు, మాజీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కాంట్రాక్టు కార్మికులకు ఈ డిస్పెన్సరీ ఎంతో అవసరమైన వైద్య సేవలను అందిస్తోందన్నారు. అయితే డిస్పెన్సరీ ప్రారంభించినంత మాత్రాన సమస్య పూర్తిగా పరిష్కారమైనట్లు కాదని, వెంటనే శాశ్వత వైద్యుడిని నియమించి, అవసరమైన వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీ చేయడంతో పాటు తగిన మందుల నిల్వలు అందుబాటులో ఉంచి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు.దీనిపై స్పందించిన డైరెక్టర్ (పీపీ) కే. వెంకటేశ్వర్లు త్వరలోనే వైద్యుడితో పాటు అవసరమైన సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. అలాగే డిస్పెన్సరీ నిర్వహణ కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని ఏర్పాటు చేసి పునఃప్రారంభానికి సహకరించిన ఏరియా జనరల్ మేనేజర్, ప్రధాన ఆసుపత్రి సీఎంఓలకు ఎఐటియుసి నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఉపాధ్యక్షుడు కత్తెర్ల రాములు, నాయకులు హుమాయూన్, మండల రాజేశ్వరరావు, మల్లికార్జున్, అప్పారావు, సీపీఐ నాయకులు కంచర్ల జములయ్య, కార్పొరేటర్ శంకర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ