తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 7 , జూలూరుపాడు మండలం వీరభద్రపురం గ్రామంలో ఈరోజు సాయంత్రం మూడు గంటల సమయంలో వచ్చిన గాలి వానకు కల్తి శ్రీను నాలుగు గదుల రేకుల ఇల్లు పూర్తిగా పైకప్పు లేచిపోయి పక్కన పడ్డది దీనితో ఇంట్లో ఉన్న 5 క్వింటాళ్ల బియ్యం మరియునిత్యవసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా తడిసి ముద్దయినవి.ఎలక్ట్రికల్ వైర్లతో సహా పూర్తిగా ధ్వంసమైనవి. కల్తీ శ్రీను మాట్లాడుతూ ఈ మధ్యనే కొంచెం అప్పుగా తీసుకున్న రొక్కంతో కొత్త రేకులు వేసుకున్నానని గాలి వాన వలన సుమారు లక్ష రూపాయలకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధను వ్యక్తపరిచాడు
Admin
తెలుగు వెలుగు టీవీ