తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా గుర్తింపు సంఘం ఎఐటియుసి ఆధ్వర్యం లో అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్స్ నందు మెమొరాండం అందచేసిన నాయకులు గురువారం ఉదయం కొత్తగూడెం ఏరియా లో అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్స్ నందు మెమొరాండం అందచేసిన ఎఐటియుసి నాయకులు,ఈ యొక్క సమావేశాల్లో బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జునరావు మాట్లాడుతూ సింగరేణిలో పేరుకుపోయిన కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కమిటీల పేరు మీద కాలయాపన చేయవద్దని యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మెడికల్ బోర్డు ఆరు నెలల నుంచి నిర్వహించకపోవడం వలన కార్మికులు అనారోగ్య కారణాల వలన ఉద్యోగం చేయలేక పోవడంతో ఆర్థికంగా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు, సొంత ఇంటి పథకం అమలు చేయాలని, మారుపేర్ల మీద ఉన్న విజిలెన్స్ కేసులు పరిష్కరించి వారి పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలని, అలవెన్స్ల మీద విధిస్తున్న ఇన్కమ్ టాక్స్ను కోలిండియాలో మాదిరిగా యాజమాన్యమే భరించాలని కోరారు,అలాగే డిస్మిస్ అయిన ఉద్యోగులకు మరోసారి అవకాశం కల్పించాలని, సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘంతో చర్చించకుండా 150 మస్టర్ల సర్కులర్ను వెంటనే రద్దు చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్షను వెంటనే నిర్వహించాలని, మెడికల్ అన్ఫిట్ అయ్యి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగం కల్పించాలని, వీకే కోల్ మైన్ లో పర్మినెంట్ ఉద్యోగాలతోనే నడిపించాలని,ఈ యొక్క డిమాండ్లను కనుక యాజమాన్యం త్వరగా స్పందించి పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కార్మికులందరూ ఆందోళనలకు సిద్ధంగా ఉండాలని మరియు నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉండాలని కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది. కార్మికుల డిమాండ్స్ పరిష్కరించాలని అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్స్ నందు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో,సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బ్యారర్స్, సందబోయిన శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు, హీరాలాల్, పిట్ కార్యదర్శిలు హుమాయూన్, మధుకృష్ణ, కమల్, ఏం ఆర్ కే ప్రసాద్, సురేందర్, సౌజన్య,సీనియర్ నాయకులు రాజాలపూడి సాంబమూర్తి, బండి వెంకటరమణ,కర్రు రమేష్, మెంగన్ రవి,కోటి,మురళి,గుమ్మడి మురళి,మాచర్ల శ్రీనివాస్, ఓం ప్రకాశ్, సుబ్రమణ్యం, వినయ్, లిఖిత్, గావిని నాగరాజు,రాజేష్,సురేష్,సాగర్,కృష్ణ,కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ