తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 16 వ డివిజన్ నేతాజీ బస్తిలో సిపిఐ సీనియర్ నాయకులు రామ్ నరసయ్య మరణ వార్త తెలుసుకున్న సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతాజీ బస్తి శాఖ సెక్రెటరీ రామ్ రాకేష్ పెదనాన్న రామ్ నరసయ్య మరణం సిపిఐ కి తీరని లోటు అన్నారు. రామ్ నరసయ్య ఆశయ సాధన కోసం మనందరం కృషి చేయాలని ఆయనకు ఘనంగా జోహార్లు అర్పించారు. ఈ పార్థివ దేహాన్ని సందర్శించిన వారిలో ఉన్నదాసు గడ్డ శాఖ 1 కార్యదర్శి తొగరు నరేంద్ర కుమార్, నేతాజీ బస్తి కార్యదర్శి రామ్ రాకేష్, సీనియర్ నాయకులు తమ్మ ప్రేమ్ కుమార్, ఎస్.వి.రామారావు, వెంకట్ ,రామ్ రమేష్, రామ్ రాజు మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ