Tuesday, 28 July 2026 06:10:19 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలు అందజేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కోరారు.

Date : 24 August 2024 06:49 PM Views : 708

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శనివారం ఐ డి ఓ సి లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు, రైతులు, యువకులు, పాత్రికేయలు, నిపుణులతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగాజిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి నూతన రెవెన్యూ చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, దీనిలో భాగంగానే నూతన రెవెన్యూ చట్టం 20 24 ముసాయిదా బిల్లు రూపొందించిందని కలెక్టర్ చెప్పారు . నూతన చట్టం రూపకల్పనలో రైతులను, ప్రజలను మేధావులను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వర్క్ షాప్ లో నిర్వహించాలని ఆదేశించిందని కలెక్టర్ తెలిపారు. బిల్లు అంశాలు,రైతుల భూ రికార్డులు పకడ్బందీగా ఉండాలని ఉద్దేశంతో ముసాయిదా బిల్లుపై మేధావులు విద్యావేత్తలు, రెవెన్యూ అధికారులు, రిటైర్డ్ అధికారులు, భద్రాద్రి కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు, రైతులు, రైతు సంఘం నాయకులు, తమ సూచనలు అందజేయాలని కలెక్టర్ కోరారు.

రైతులు మాట్లాడుతూ చట్ట మార్పు చేసేటప్పుడు భూ సర్వే నిర్వహించాలని, భూమిపై ఉన్న రైతులు మాత్రమే నమోదు చేయాలని తెలిపారు. గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ ఉండాలని, పాత చట్టాలను మార్చి, కొత్త చట్టాలలో ప్రతి సంవత్సరం పహానీలలో నమోదు ఉండాలని, శిస్తు వసూలు మళ్లీ పెట్టాలని, కాస్త కాలం ఉండాలని,ఆర్వోఆర్ ను సవరించాలని, పొజిషన్ కాలం ఉండాలని కబ్జా ఉన్న రైతులకే పట్టా ఇవ్వాలని, ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కొత్త చట్టం గురించి తెలపాలని, గ్రామాల వారిగా ఉన్న సర్వే నెంబర్లలో భూమి ఎక్కువగా ఉంటుందని సరిచేయాలని, భూమి అమ్మిన వారి పేర్లను తొలగించాలని, ధరణి పోర్టల్ వల్ల రైతులకు చాలా నష్టం జరిగిందని దాన్ని తీసేయాలని, ఈ చట్టం ద్వారా గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదని, భూములను మ్యాపింగ్ చేయాలని, రైతుబంధు తీసుకుంటున్న రైతుల భూములను పరిశీలించాలన్నారు.ఆధార్ నమోదు తో పాటు మరేదైనా కార్డు కంపల్సరిగా తీసుకోవాలని, కొత్త చట్టంలో అప్పిల్ ఉండాలని, పొజిషన్ కాలం కూడా ఉండాలని, ప్రభుత్వం చట్టంపై రైతుల అభిప్రాయాలు తీసుకొని చట్టం చేయడం చాలా సంతోషంగా ఉందని, సాదా బైనామా చేసే అధికారం డివిజన్ అధికారులకు ఇవ్వాలని, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ లో సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేయాలని, జమాబందీ జరగాలని, ఏ రైతు అప్పిలైన జిల్లా లెవల్లో అయిపోవాలని, గ్రామాల వారీగా రికార్డులు చేపట్టాలని, భూ సమస్యల అప్పిలేటదారిటీ జిల్లా స్థాయిలో ఉండేలా చూడాలని, ప్రతి గ్రామంలో రెవెన్యూ ఉద్యోగి నియమించాలని వారు కోరారు. ఇంకా ఈ సమావేశానికి రానివారు, నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ror2024- rev@telangana.gov.in వెబ్ సైట్ లో అప్లోడ్ చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు మధు, దామోదర్ బార్ అసోసియేషన్ సభ్యులు సోమేశ్, తాసీల్దార్లు, న్యాయవాదులు, రెవెన్యూ సిబ్బంది, అరిటైర్డ్ అధికారులు, రైతు సంఘం నాయకులు, రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :