తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి తాత్కాలిక తరగతి గదులకై కేటాయించబడిన భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. పాత కొత్తగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆనంద ఖని లో గల భవన సముదాయాన్ని పరిశీలించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వారు సూచించిన సూచనలకు అనుగుణంగా మార్పులు చేయుటకు ప్రతిపాదనలు రూపొందించి అందజేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ పనులు త్వరితగతిన పూర్తయి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కల్లా కేంద్రీయ విద్యాలయం తరగతిలు ప్రారంభించేటట్లుగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్, విద్యాశాఖ ఇంజనీరింగ్ విభాగ అధికారి రాజగోపాల్ పాల్గొన్నారు. అనంతరం పక్కనే గల పట్టణ గురుకుల పాఠశాల (బాలురు) సందర్శించి అక్కడ విద్యార్థులతో మాట్లాడి పిల్లలకు ఏమైనా అవసరాలు ఉంటే తనకు తెలియజేయాలని స్పెషల్ ఆఫీసర్ ను ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ