తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలంలోని సెంట్రల్ పార్కులో ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్(ఎస్ జీ ఎఫ్ ) ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని నిర్వహించారు. సెంట్రల్ పార్క్ లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ విశిష్టతను చాటిచెప్పారు.ఎస్ జి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోగాని శ్రీనివాస్, కో-ఆర్డినేటర్ మహమ్మద్ ఖాసిం, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిమళ్ల బ్రహ్మంచారి, కోశాధికారి సమ్మయ్య, స్పోర్ట్స్అండ్ సంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ శనగ రామచందర్ రావు లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ