Tuesday, 28 July 2026 01:16:11 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పిల్లలూ.. బాగా చదివి కలెక్టర్, ఎస్పీ కావాలి : విద్యార్థులకు సూచించిన మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాంరెడ్డి

Date : 20 August 2024 08:34 PM Views : 611

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : "పిల్లలూ.. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి?. మంచిగా చదువుకుంటున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మేము ఎవరో తెలుసు కదా...? చెప్పండి. మీ సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తాం. బాగా చదువుకోండి మరి" అంటూ.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి విద్యార్థులతో అన్నారు. మంగళవారం అశ్వారావుపేట మండలం సున్నం బట్టి గ్రామంలో గల ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలను తనిఖీ చేశారు. ప్రాంగణమంతా కలియతిరిగి, వంటగది, విద్యార్థుల గదులు పరిశీలించారు. అనంతరం పిల్లలతో కాసేపు మాట్లాడారు. ఆ వివరాలు ఇలా. మీ కలెక్టర్, ఎస్పీ సార్ మాదిరి ఉన్నతంగా నిలవాలి మీకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని బాగా చదివి మీ కలెక్టర్ జితేష్ వీ.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ మాదిరిగా మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలని మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాంరెడ్డి సూచించారు. అక్కడున్న ఓ బాలుడు తన పేరు మహేష్ అని చెప్పగా.. నువు పెద్దయ్యాక హీరో మహేష్ బాబు లాగా అవుతావా మరి అని అడగడంతో అక్కడున్న వారంతా నవ్వారు. మేమెవరమో తెలుసు కదా.. అరేయ్ పిల్లలూ.. నేను తెలుసు కదా అని పిల్లలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రశ్నించారు. దీంతో చాలామంది వో.. తెలుసంటూ తలలూపారు. ఆ తర్వాత మంత్రి పొంగులేటి ఎంపీ రఘురాంరెడ్డిని, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబును ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను, కలెక్టర్, ఎస్పీలను పిల్లలకు పరిచయం చేశారు. ఆ గుగ్గిళ్ళు సరిపోతున్నాయా..? కాసేపు పిల్లలతో సరదా సంభాషణ ఈ హాస్టల్లో 110 మంది పిల్లలు ఉంటే ఆ చిన్న గిన్నెలో గుగ్గిళ్ళు ఉడక పెడుతున్నారు.. అవి సరిపోతాయా రా మీకు..? అంటూ మంత్రి పొంగులేటి ప్రశ్నించడంతో అక్కడున్న పిల్లలు.. పెద్దలు సరదాగా నవ్వుకున్నారు. చికెన్ ఎప్పుడు పెడుతున్నారు.. భోజనం బాగుంటుందా.. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. అంటూ మంత్రి, ఎంపీ ప్రశ్నించారు. మాకు బెడ్ షీట్లు, బంగాళదుంప కూర కావాలి తమకు బెడ్ షీట్లు, పరుపులు లేవని.. అందరికీ పూర్తిస్థాయిలో అందలేదని విద్యార్థులు మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాం రెడ్డి ఎదుట వాపోయారు. దీనికి మంత్రి, ఎంపీ స్పందిస్తూ తప్పకుండా ఈ సమస్యలు పరిష్కరిస్తామని..మీరు బాగా చదువుకోవాలి అని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :