Tuesday, 28 July 2026 04:02:34 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. విద్యా కార్యక్రమాల అమలుపై కీలక ఆదేశాలు. రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా.

Date : 30 April 2026 08:14 PM Views : 221

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గురువారం, హైదరాబాదు నుంచి విద్యా శాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తో కలిసి రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా అన్ని జిల్లాల కలెక్టర్లతో 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించే విద్య వారోత్సవాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా కార్యక్రమాల అమలు, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. 2026-2027 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 2700 ప్రభుత్వ పాఠశాలలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్, మరుగుదొడ్లు, తదితర సౌకర్యం లేని పాఠశాలలలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంటర్, పదో తరగతిలో ఫెయిల్ అయిన ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులకు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో మే 11వ తేదీ నుంచి వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులతో శంకుస్థాపనలు చేయించాలన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ప్రజాప్రతినిధులను, అధికారులను భాగస్వాములు చేస్తూ విద్యా శిబిరాలు, వర్క్ షాప్ లు, బడిబాట, తదితర కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. విద్యా వారోత్సవాల కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలన్నారు.మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుత్, తాగునీటి కొరత ఉన్న పాఠశాలల్లో UDISE (యూడైస్) పోర్టల్ ప్రకారం తక్షణమే పనులు పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు పోర్టల్ లో నివేదికలను సరిగా నమోదు చేయాలన్నారు.కేజీబీవీలలో పది, ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులయ్యేలా రెమెడియల్ కోచింగ్ నిర్వహించాలన్నారు. విద్యార్థుల కోసం వేసవి క్యాంపులు నిర్వహించి, సప్లిమెంటరీ కోచింగ్ ఇవ్వాలన్నారు.అనంతరం విద్యా శాఖ సంచాలకులు మాట్లాడుతూ.. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి 16 వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.నియోజకవర్గ స్థాయిలో సర్పంచులు, వార్డు సభ్యులు, పాఠశాల విద్య కమిటీలతో వర్క్‌షాప్ నిర్వహించాలన్నారు. బడిబాట అండ్ పిటిఎం ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ కింద విద్యార్థుల నమోదుకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. బడి బాటపై ర్యాలీలు చేపట్టి, అవగాహన పెంపొందించాలన్నారు.డ్రాపౌట్ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, తిరిగి బడిలో చేర్పించాలన్నారు.జిల్లాలో పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి, ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ 1వ, 2వ సంవత్సరం డ్రాపౌట్ విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించడానికి జిల్లా విద్యా శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. బాలబాలికల భద్రత, సాంస్కృతిక కార్యక్రమాలు, చేతి కళలు వంటి కార్యక్రమాలను నిర్వహించి, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించాలన్నారు. వీసీ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీమతి బి. నాగలక్ష్మి, విద్యాశాఖ జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్, ACGE మాధవరావు మరియు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :