తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం బార్ అసోసియేషన్ హాల్లో అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, దేవదానం ఆధ్వర్యంలో తెలంగాణ బార్ కౌన్సిల్ నెంబర్ గా పోటీ చేస్తున్న దుస్సా జనార్దన్ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ తెలంగాణ బార్ అసోసియేషన్ మెంబర్ గా IALతరుపున ప్రస్తుతం పోటీ చేస్తున్న దుస్సా జనార్దన్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలపై మాట్లాడుతూ న్యాయవాదుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని న్యాయవాదులను కోరారు. దుస్సా తో పాటుగా ఐఏ ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యలమోలు ఉదయ భాస్కరరావు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాగా మాధవరావు, ఉపాధ్యక్షులు గోపికృష్ణ, సీనియర్ న్యాయవాదులు పోసాని రాధాకృష్ణమూర్తి, గౌరీ శంకర్ ,కూరపాటి అశోక్, ఏక స్వామి, IAL రాష్ట్ర నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు ఉప్పు శెట్టి సునీల్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ